1. భారతదేశంలో ఏ రాష్ట్రంలో తొలిసారి రాష్ట్రపతి పాలన ప్రకటించారు
2. భారతదేశంలో చివరిసారిగా రాష్ట్రపతి పాలన ప్రకటించిన రాష్ట్రం ఏమిటి
3. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రకటించలేదు మరియు ఆ రాష్ట్రాలు ఏ ఏ సంవత్సరాల్లో ఏర్పడ్డాయి
4. రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఎన్ని నెలల్లోగా ఆమోదించాలి
5. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ప్రకటించడం జరిగింది
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్ భవన్ ప్రస్తుత అధిపతిగా ఎవరు ఉన్నారు
7. ఇటీవల మహారాష్ట్ర తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు
8. మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు
9. మణిపూర్ ప్రస్తుత లోక్ భవన్ అధిపతిగా ఎవరు ఉన్నారు
10. రాష్ట్రాల పనితీరును ఎన్ని రోజులకు ఒకసారి గవర్నర్ కేంద్రానికి నివేదిక అందజేస్తారు
11. వాతాపికొండ అనే బిరుదు ఏ పల్లవ రాజుకు కలదు
12. మంచికల్లు శాసనాన్ని ఎవరు వేయించారు
13. 50 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు అవి ఏవి
14. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఎవరి కుమారుడు
15. ఏ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్లాల్ ఇటీవల పొందడం జరిగింది.
16. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు మరియు దాని సిఫాసులు ఏ ఏ సంవత్సరాల మధ్య అమలు చేయబడతాయి
17. 16వ ఆర్థిక సంఘం సమాంతర వికేంద్రీకరణలో ఎన్ని కేటగిరీలను సిఫార్సు చేసింది (horizontal devolution)
18. horizontal devolution లో 16వ ఆర్థిక సంఘం చేర్చిన కొత్త క్యాటగిరి లేదా క్రైటీరియా ఏమిటి
19. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని అవి ఏ ఏ సంవత్సరాల మధ్యన అమలు చేయడం జరిగింది
20. ఎర్త్ సమిట్ ఏ సంవత్సరంలో జరిగింది
21. 2026 ఐపీఎల్ సీజన్ కి అత్యధిక ధర పొందిన ఆటగాడు
22. 2026 లో ఎన్నో ఐపీల్ జరగనుంది
23. లోక్సభ స్పీకర్ హోమ్ బిర్లా పై అవిశ్వాస తీర్మాన సమయంలో లోక్ సభ స్పీకర్గా ఎవరు ఉండడం జరిగింది
24. Pm కిసాన్ పథకంనీ కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది
25. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది. దీనిపై వేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు
26. కేంద్ర ప్రస్తుత న్యాయశాఖ మంత్రి
27. రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం ఏ సంవత్సరంల మధ్య జరిగింది
28. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటీ ఏమిటి
29. ఇండియాకు పురుషుల t20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్లు ఎవరు
30. గంగానది ప్రవహించే రాష్ట్రాలలో కొత్తగా ఏ రాష్ట్రాలకు నూతన గవర్నర్లు నియమితుల అవ్వడం జరిగింది.?
Answers:-
1. పంజాబ్ (1951లో)
2. మణిపూర్ (2025)
3. చతిస్గడ్ తెలంగాణ (చతిస్గడ్ 2000 nov 1 నా ఏర్పడింది. తెలంగాణ 2014 జూన్ 2 న ఏర్పడింది)
4. రెండు నెలల లోగా
5. మణిపూర్
6. లోక్భవన్ అధిపతిని గవర్నర్గా పేర్కొంటాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నాజీర్
7. సునేత్రా పవార్
8. వై.ఖేమ్‌చంద్ సింగ్
9. అజయ్ కుమార్ భల్లా(మణిపూర్ రాష్ట్ర గవర్నర్)
10. 15
11. మొదటి నరసింహవర్మన్
12. సింహవర్మ I
13. 15(The prime numbers below 50 are 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, and 47. )
14. షాజహాన్
15. 2023
16. అరవింద్ పనగరీయా 2026- 2031
17. 6
18. GDPకి సహకారం (10%)
19. 8(2000 to 2015 వరకు అమలు చేయడం జరిగింది)
20. 1992( The primary Earth Summit (United Nations Conference on Environment and Development) was held in 1992, from June 3 to June 14, in Rio de Janeiro, Brazil. Also known as the Rio Summit or ECO92,)
21. 2026 ఐపీఎల్ (IPL) మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అతన్ని ₹25.20 కోట్లకు కొనుగోలు చేసింది, తద్వారా అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
22. 19వ
23. జగదాంబికా పాల్
24. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 2019 లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అధికారికంగా ప్రారంభించారు . 2019లో ప్రారంభించినప్పటికీ, ఈ పథకం డిసెంబర్ 1, 2018నుండి మునుగోడు నుండి అమలు చేయబడింది
25. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025, అవినీతి లేదా తీవ్రమైన నేరారోపణలపై 30 రోజులకు పైగా జైలులో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రులు లేదా మంత్రులను పదవుల నుండి తొలగించే ప్రక్రియను (31వ రోజున ఆటోమేటిక్ తొలగింపు) సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164 మరియు 239AA లను సవరించనుంది. ఈ బిల్లుకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) చైర్మన్ అపరాజిత సారంగి.
26. భారతదేశ ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ (Shri Arjun Ram Meghwal).
27. రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం 1803 నుండి 1805 సంవత్సరాల మధ్య జరిగింది. ఈ యుద్ధం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా సామ్రాజ్యం (ముఖ్యంగా హోల్కర్లు మరియు పేష్వా బాజీ రావ్ II) మధ్య జరిగింది. ఈ యుద్ధం ఫలితంగా మరాఠాలు తమ భూభాగాలను కోల్పోవడంతో పాటు, బ్రిటిష్ ఆధిపత్యం పెరిగింది.
28. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమీక్షించి, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని (15-04-2025న) ఏర్పాటు చేసింది. ఈ మూడు సభ్యుల కమిటీలో కురియన్ జోసెఫ్‌తో పాటు మాజీ సివిల్ సర్వెంట్ కే. అశోక్ వర్ధన్ శెట్టి, ఆర్థికవేత్త డాక్టర్ ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉన్నారు
29. T20 ప్రపంచ కప్‌లను గెలిపించిన భారత కెప్టెన్లు ఎం.ఎస్. ధోని (2007), రోహిత్ శర్మ (2024) మరియు సూర్యకుమార్ యాదవ్ (2026). ధోని మొదటి ఎడిషన్ గెలవగా, రోహిత్ శర్మ 2024లో, సూర్యకుమార్ యాదవ్ 2026లో (భారత్ వేదికగా) టైటిల్ సాధించారు.
30. గంగా నది భారతదేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హిమానీనదం (గోముఖ్) వద్ద జన్మించి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ, చివరికి బంగ్లాదేశ్ గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇందులో మార్చి 2026లో జరిగిన గవర్నర్ల మార్పుల్లో భాగంగా, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ బీహార్ కొత్త గవర్నర్‌గా, మరియు ఆర్.ఎన్. రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు.