1. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొత్తగా పంచాయతీలను ఎన్ని కేటగిరీలుగా పునర్ వర్గీకరణ చేయడం జరిగింది.
2. టి20 ప్రపంచ కప్ 2026 గెలిచిన భారత జట్టు యొక్క కోచ్ ఎవరు
3. ఇన్నేళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టనున్నారు మరియు జరగబోయే ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో ఎక్కడ జరుగుతున్న ఒలంపిక్స్ లో క్రికెట్ ను ఆడనున్నారు
4. ఇటీవల వార్తల్లో నిలిచిన అనువాద కృత్రిమ మీద ఆధారిత సాధనం సువాస్ ఫుల్ ఫామ్
5. ఆంధ్రప్రదేశ్ కొత్త పంచాయతీ పునర్ వర్గీకరణ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే రూర్బన్ పంచాయతీల జనాభా ఎన్ని వేలకు పైగా ఉండాలి మరియు వార్షికాదాయం ఎంతకంటే ఎక్కువ ఉండాలి
6. ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది
7. ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణానది వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎన్ని కోట్లతో ప్రారంభించింది
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా అరుదైన శాస్త్ర చికిత్స చేయడం జరిగింది తెగిపడిన చేతిని అతికించిన ఏయిమ్స్. ఏ ఏయిమ్స్ శాస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది
9. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు
10. ఇటీవల ఐఐటి మద్రాస్ ఆరుగురు అత్యుత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు ఫస్ట్ ప్రిన్సిపాల్ టీచర్స్ 2026 అవార్డుతో సత్కరించింది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు దీనికి ఎంపికయ్యారు
11. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది దానికి ఎవరు అధ్యక్షత వహించారు మరియు దానికి ఎవరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు
12. 194 కోట్లతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ను ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు
13. తుంగభద్ర జలాశయంలో మొత్తం ఎన్ని గేట్లు కలవు (ఇటీవల నూతన గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది)
14. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య 2600 km పొడవున బ్రిటీష్ పాలకులు గీసిన సరిహద్దు రేఖ ఏమిటి
15. జి 7 సభ్య దేశాలు ఏవి? అవి ఏమిటి
16. యాసిడ్ బాధితుల కోసం ఇటీవల సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి అయితే యాసిడ్ బాధితుల కోసం అపిల్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరు
17. ఇటీవల సుప్రసిద్ధ చరిత్రకారుడు కే ఎన్ ఫన్నీకర్ మరణించడం జరిగింది అయితే అతను ఏ విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా మరియు ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా పనిచేయడం జరిగింది (బ్రిటిష్ కాలం నాటి భారతి చరిత్రపై పొడి పుస్తకాలు రచించారు)
18. 2026 లో ఎన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి
19. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ మరియు ఇద్దరు కమీషనర్లు గా ఎవరు పనిచేస్తున్నారు. మరియు సీఈఓ గా ఎవరు పని చేస్తున్నారు
20. 2021 నుంచి 25 వరకు గల కాలానికి సంబంధించిన ఆయుధ దిగుమతులలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో పేర్కొంది అయితే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటి
21. భారత్ తన ఆయుధ దిగుమతిని ఏ దేశం నుంచి 40 శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది
22. విద్యుత్ రంగానికి సంబంధించి సమగ్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన ఇండియా ఎనర్జీ స్టాక్ ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026 27) ఆంధ్రప్రదేశ్ సహా ఎన్ని రాష్ట్రాలలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు ఆ రాష్ట్రాలు ఏమిటి
23. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి అయిన ఎవరి నేతృత్వంలో ఎంత మంది సభ్యులతో 2023 సెప్టెంబర్ 2న కమిటీని వేయడం జరిగింది
24. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో మూలధన వ్యయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత చేయనున్నారు
25. 16వ ఆర్థిక సంఘం యొక్క పన్నుల పంపిణీకి సంబంధించిన ఆరు ప్రాతిపదికలు ఏమిటి
Answers:-
1. 4
2. గౌతమ్ గంభీర్
3. దాదాపు 128 ఏళ్ల తర్వాత (చివరిగా 1900లో ఆడిన తర్వాత) ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లు 2028 సంవత్సరంలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (LA28) లో జరగనున్నాయి. ఈ పోటీలు టీ20 (T20) ఫార్మాట్‌లో జరగనుండగా, జూలై 12, 2028 నుండి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి
4. సుప్రీంకోర్టు విధిక్ అనువాద సాఫ్ట్వేర్
5. జనాభా పదివేలకు పైగా వార్షికాదాయం కోటి కంటే ఎక్కువ
6. విశాఖపట్నం విజయవాడ,
7. 294.20 కోట్లు (పదిహేను లక్షల క్యూసేకుల వరద తట్టుకునేలా డిజైన్)
8. మంగళగిరి ఎయిమ్స్
9. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి మరియు నవ్యాంధ్ర) నుంచి ఇప్పటివరకు ఇద్దరు ప్రముఖులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా (CJI) బాధ్యతలు నిర్వహించారు. వారు జస్టిస్ కోకా సుబ్బారావు (9వ CJI) మరియు జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (48వ CJI).
10. శ్రీ చిట్టిబాబు కెమిస్ట్రీ, తిరుపతి మరియు సముద్రాల విజయ్ కుమార్ మ్యాథమెటిక్స్ తిరుపతి
11. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 9 డిసెంబర్ 1946న జరిగింది. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు. దీనికి తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంథోనీ నియమితులయ్యారు (తర్వాత 11 డిసెంబర్ 1946న శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు).
12. తిరుపతి
13. 33
14. డ్యూరాండ్ రేఖ
15. G7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) అనేది ప్రపంచంలోని ఏడు ప్రధాన అధునాతన ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మరియు యునైటెడ్ స్టేట్స్ (USA) ఉన్నాయి. ఈ దేశాలు గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్, అంతర్జాతీయ భద్రత మరియు ఇంధన విధానం వంటి సమస్యలను చర్చించడానికి ఏటా సమావేశమవుతాయి.
16. షాహిన్ మాలిక్
17. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, శ్రీ శంకరాచార్య సాంస్కృత విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ గా పని చేశారు
18. తమిళనాడు కేరళ అస్సాం వెస్ట్ బెంగాల్ (వీటితోపాటు పుదుచ్చేరి)
19. 13 మార్చి 2026 నాటికి, శ్రీ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా వ్యవహరిస్తున్నారు. ఆయన 19 ఫిబ్రవరి 2025న బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్లుగా డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు మరియు డాక్టర్ వివేక్ జోషి కొనసాగుతున్నారు
20. ఉక్రెయిన్
21. రష్యా నుంచి (2011- 15 మధ్య కాలంలో భారత దిగుమతి చేసుకున్న అస్త్రాలలో రష్యా వాట 70% గా ఉండేది. రష్యా నుంచి దిగుమతి చేసుకొని అస్త్రాలు దీన్నిబట్టి చూస్తే క్రమంగా తగ్గుతూ వస్తుంది)
22. 5(ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర)
23. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది
24. 12,21,821 కోట్లు
25. ఆదాయ దూరం (42.5%), జనాభా (17.5%), డెమోగ్రాఫిక్ పనితీరు, అటవీ విస్తీర్ణం (10% చొప్పున), మరియు కొత్తగా జిడిపి (GDP) వాటా (10%), ఏరియా (10%) వంటి ప్రమాణాలను ఉపయోగించింది.