Back to Current Affairs

13/03/2026 questions

1. ఈ క్రింది వాటిలో ఏది సరైనది?   A: ఆంధ్రప్రదేశ్లో జరిగిన సూక్ష్మ శిల యుగానికి మరొక పేరు మధ్య శిలాయుగం B:మధ్య శిలా యుగంలో తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.  C:మధ్య శిలాయుగ చివరిలో మానవుడు చేతితో కుండలు తయారు చేయడం మొదలుపెట్టాడు
2. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇనుప యుగంలో గల డాల్మన్ అనగా ఏమిటి
3. ఏ యుగంలో ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా విస్తరించడం జరిగింది
4. ఆంధ్రప్రదేశ్లో ఏ  యుగంలో తొలిసారిగా  వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది
5. పూర్వ ప్రాచీన యుగంలో గల కుదురు అనగా ఏమిటి 
6. జలజీవన్ మిషన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది 
7. అరుణ్ జెట్లీ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు 
8. ఈ సంవత్సరం పీఎం కిసాన్ మూడో విడతను అందించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించనున్నారు 
9. పీఎం కిషన్ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఏపీ సీఎం అధికారికంగా ఎక్కడ ప్రారంభించి అందించనున్నారు 
10. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాజధానిలో ఎన్ని కోట్లతో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది 
11. జలజీవన్ మిషన్ కాల వ్యవధిని ఏ సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ఆమోదించడం జరిగింది 
12. జనసేన పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది 
13. డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు 
14. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎవరు పని చేస్తున్నారు 
15. ఈనెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టింది 
16. ఉపాధి హామీ పథకాన్ని ఏ పేరుతో మార్చడం జరిగింది మరియు దానికి ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది
17. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి ఎవరు 
18. ధర్మదేవుడిని, విదురుడుగా జన్మించమని ఏమని శపించడం జరిగింది
19. గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో భారత్ తన మొదటి ఏఐ ఆధారిత విశ్వవిద్యాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎక్కడ ఇటీవల ప్రారంభించింది
20. ఏ రాష్ట్రంలో ప్రసిద్ధా లివింగ్ రూట్ బ్రిడ్జిలను భారత్ అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా 2026 - 27 కు నామినేట్ చేసింది
21. జాబిల్లి మీద జల అన్వేషణ కోసం చాంగ్ఓ 7 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించనుంది
22. అంగారకుడి చంద్రుడి మీదకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) ఆ ఏ ప్రయోగాన్ని చేయనుంది
23. ప్లేటో వ్యోమనౌకను ఏ ఏజెన్సీకి చెందినది 
24. రోమన్ టెలిస్కోప్ ను ఏ సంస్థ ప్రయోగించనుంది 
25. బిపికొలంబో ప్రయోగాన్ని ఏ గ్రహంపై చేపట్టనున్నారు
26. దేశంలో థోరియo ఆధారిత న్యూక్లియర్ ఎనర్జీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ప్రోటాన్ యాక్సిలరేటర్ ను ఏర్పాటు చేయనున్నారు
27. టి20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి బీసీసీఐ ఇటీవల ఎన్ని కోట్ల భారీ నజరానా ప్రకటించింది
28. బిసిసిఐ అనకా ఫుల్ ఫామ్ మరియు ఎప్పుడు ఏర్పడింది 
29. హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా ఇటీవల ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 
30. కత్తి కాంతారావు జాతీయ పురస్కారం 2025 నీ ఎవరు సేకరించారు 
31. ఏ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్ముర సవరణ లో పేరు నమోదు నోచుకోలేకపోయిన వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించ పరిష్కరించేందుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర ఆపిలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
32. భారత నౌకాదళానికి సముద్ర నిగూ విమానం పీ8ఐ నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది దీన్ని ఏ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు(విశాఖపట్నంలోని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ మోడల్ సంస్థగా వ్యవహరించింది)
33. జలజీవన్ మిషన్ పథకం అమలను పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో ఏ పేరుతో ఒక డిజిటల్ ఫెమ్ వర్క్ ను కేంద్రం అమల్లోకి తీసుకు వస్తుంది 
34. ఏ సంవత్సరం నాటి షరియత్ చట్టం రద్దు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో రాజ్యాలు దాఖలు చేయడం జరిగింది 
35. ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది మరియు ఏ అంశంలో భాగంగా ఉంది
 

Answers:- 
1. A, B, C 
2. చనిపోయిన వారిని రాతి పలకలతో పెటెవలె నిర్మించి దానిపై మూతగా రాతి పలకను ఉంచడం ఒక వైపు పలకకు పెద్ద రంధ్రం ఉంటుంది పెట్టే భూమ్మీద ఉన్న సమాధిని డాల్మన్ అని అంటారు(పెట్టెను భూ స్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంతో రాతి రాళ్లు పేర్చిన సమాధిని సిస్ట్ అంటారు)
3. ఇనుప యోగం 
4. నవీన శిలా యుగం 
5. ఈ యుగంలో మానవుల రక్త సంబంధీకులు అందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడేవారు ఈ గుంపు నే కుదురు అంటారు 
6. జల జీవన్ మిషన్ (Jal Jeevan Mission) ను 2019, ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలనే (హర్ ఘర్ జల్) లక్ష్యంతో, జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించడం జరిగింది.
7. అరుణ్ జెట్లీ క్రికెట్ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా) న్యూఢిల్లీలో ఉంది. 
8. అస్సాంలోని గౌహాటీలో 
9. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో 
10. 119.27 కోట్లు 
11. 2028 
12. 2014 మార్చి 14 
13. ఓర్వకల్లు 
14. రాయపాటి శైలజ 
15. జన్ సున్ వాయ్ 
16. కొత్త ఉపాధి హామీ చట్టం పేరు "వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)", దీనిని సంక్షిప్తంగా వికసిత్ భారత్ - జీ రామ్ జీ (VB-G RAM G) అని పిలుస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ, కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకానికి బడ్జెట్‌లో ₹95,692.31 కోట్లు కేటాయించింది. 
17. నిమ్మల రామానాయుడు 
18. మాండవ్యముని 
19. చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, మేరట్ 
20. మేఘాలయ (స్థానిక కాశీ జైoటియా తెగలు నిర్మించిన ఈ సహజ వంతెనలు స్థిరత్వం సాంప్రదాయం పర్యావరణ అనుకూలా తలకు చిహ్నాలు)
21. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 
22. మారిటన్ మూన్స్ ఎక్స్ప్లోరేషన్ (అంగాకురుడికి ఫోబోస్, డిమోస్ అనే రెండు చంద్రులు ఉన్నాయి)
23. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 
24. నాసా 
25. బుధుడు 
26. విశాఖపట్నం 
27. 131 కోట్లు 
28. BCCI అంటే Board of Control for Cricket in India (భారత క్రికెట్ నియంత్రణ మండలి). ఇది 1928 డిసెంబరులో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉంది
29. ఎం జీవన్ రెడ్డి 
30. రాజేంద్రప్రసాద్ 
31. పశ్చిమ బెంగాల్ 
32. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), నేవి సంయుక్తంగా నిర్వహించాయి
33. సుజలం భారత్ 
34. 1937 
35. ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code - UCC) గురించి భారత రాజ్యాంగంలోని 4వ భాగం (Part IV) లోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 44 వివరిస్తుంది. ఆర్టికల్ 44 ప్రకారం, భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని (వివాహం, విడాకులు, వారసత్వం మొదలైనవి) రూపొందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.