Back to Current Affairs

15/03/2026 questions

1. అమెరికాలోని చమురు రిఫైనరీ నిర్మాణంలో భారత్కు చెందిన ఏ సంస్థ భారీ పెట్టుబడులను పెట్టనుంది
2. 19వ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఏ రెండు టీములు మధ్య జరగనుంది 
3. అమెరికాలో జరగబోయే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో ఏ దేశం పాల్గొనబోమని ఇటీవల ప్రకటించడం జరిగింది 
4. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023 24 ఇండెక్స్ ను నీతి అయోగ్ రిలీజ్ చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్యంలో 17వ స్థానంలో ఉంది అయితే దేశంలో మొదటి మూడు స్థానాలు సాధించిన రాష్ట్రాలు
5. ఫోర్బ్సు బిలీనర్స్ 2026 జాబితాలో భారత్ నుంచి మొదటి మూడు స్థానాలు సాధించినది
6. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఎవరి కారుణ్య మరణానికి ఇటీవల అనుమతి ఇవ్వడం జరిగింది
7. ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎవరు ఇటీవల నిర్మితల అవడం జరిగింది 
8. మొత్తంగా ఎన్నవా విడతగా pm కిసాన్ పథకం ద్వారా ఇటీవల రైతుల ఖాతాలో 2000 వేయడం జరిగింది
9. ఈ క్రింది వాటిని పరిశీలించి ఏమిటి సరైనదో తెలపండి? A:ఇటీవల కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగింపునకు తొలిసారి ఎంపీలు సంతకాలు చేయడం జరిగింది. B:సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంషన్నకు అనుచరించవలసిన ప్రక్రియ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వర్తిస్తుంది. C: తొలగింపు తీర్మానం ఆమోదం పొందాలంటే ఆయా సభల్లో మొత్తం సభ్యులలో సగం మందికి పైగా ఓటింగ్కు హాజరైన వారిలో మూడెంట 2 వంతులు మంది మద్దతు ఇవ్వాలి. (ఉభయ సభల్లోను ఒకేరోజు నోటీసి ఇచ్చి వాటిని సభల్లో అనుమతించే వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు నోటీస్ ఆమోదం పొందాకే స్పీకర్ రాజ్యసభ చైర్మన్ కలిపి ముగ్గురితో సంయుక్త సంఘాన్ని నియమిస్తారు అభిశంషనా కారణాలను కమిటీ విచారిస్తుంది. ఈ కమిటీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తి దేశంలోనే ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా ప్రముఖ న్యాయ కోవెందుడు దీనిలో ఉంటారు. లోక్సభలో నోటీస్ ఇవ్వడానికి కనీసం వంద మంది సభ్యులు రాజ్యసభలో ఇచ్చేందుకు 50 మంది సభ్యులు సంతకాలు  చేయాలి) D: ఆయన వైదొలుగుతున్నట్లు ముందుగానే ప్రకటన చేస్తే దానిని రాజీనామాగా పరిగణిస్తారు అప్పుడు ఆయనకు పింఛన్ ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ పార్లమెంట్ ఆయన్ని తొలగిస్తే మాత్రం ఇవి రావు
10. తొలి తెలుగు కవియిత్రి ఎవరు ఆమె జయంతిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది
11. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందించే సర్వీసులు ఏ పేరు తో అమలు చేస్తుంది
12. అన్నదాతకు యాట ఎంత ఆర్థిక సాయం మరియు ఆంధ్రప్రదేశ్లో ఎంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి జరిగింది
13. పెనుకొండ లో మెగా ఆధ్యాత్మిక సంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు అయితది ఏ జిల్లాలో కలదు
14. సులభతర వాణిజ్యంలో భాగంగా ఎన్ని లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో దుకాణాలు వాణిజ్య సంస్థలు ఏడాది పొడవునా 24 గంటలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ కార్మిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది
15. ఇటీవల ఎన్నేళ్లలోపు చిన్నారులకు పేరెంట్ మెసేజ్ వాట్సాప్ అకౌంట్ ను వాట్సప్ ప్రారంభించడం జరిగింది 
16. అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టలు పెద్ద ఎత్తున లభ్యమైన జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంషను నోటీసుపై నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ వర్షాకాల సమావేశాల్లో తమ నివేదికను అందించనున్నాయి అయితే ఇతను ఏ హైకోర్టు న్యాయమూర్తి
17. ఏపీ ప్రభుత్వం ఇటీవల బ్లూ ఎకానమీలో నూతన అధ్యయనం కోసం తీర ప్రాంత భద్రత కల్పించే విషయంలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమను ఎక్కడ శంకుస్థాపన చేసింది
18. ఇటీవల యురేనియం దిగుమతి కోసం భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదురుచుకుంది 
19. అను శక్తి కోసం ప్రైవేట్ రంగానికి కేటాయించే ఉద్దేశంతో శాంతి బిల్ 2025ను తీసుకురావడం జరిగింది అయితే దాని ఫుల్ ఫామ్ 
20. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న మూడు ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ల పేర్లు ఏమిటి (మూడు ఎకనామిక్ రీజియన్ల పేర్లు) 
21. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆమె ఏ హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అవ్వడం జరిగింది
22. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు 
23. శాతవాహనులలో హాలుడు ఎన్నవ రాజు మత్స్య పురాణo ప్రకారం 
24. శాతవాహనులలో రెండవ శాతకర్ణి అత్యధిక కాలం పరిపాలించడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలు
25. శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యానికి రాజుగా ఎవరు అయ్యారు.
 
Answers:- 
1. రిలయన్స్ ఇండస్ట్రీస్ 
2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ కు 
3. ఇరాన్( 2026 FIFA ప్రపంచ కప్‌ను కెనడా, మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి, మూడు దేశాలు ఈ టోర్నమెంట్‌ను మొదటిసారి నిర్వహిస్తున్నాయి. ఇది టోర్నమెంట్ యొక్క 23వ ఎడిషన్. గతంలో ఖతార్ (2022), రష్యా (2018), బ్రెజిల్ (2014), దక్షిణాఫ్రికా (2010) మరియు జర్మనీ (2006) ముఖ్యమైన ఆతిథ్య దేశాలు.)
4. ఒడిస్సా గోవా జార్ఖండ్లు మొదటి మూడు స్థానాలు సాధించాయి (చివరి మూడు స్థానాల్లో పంజాబ్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమబెంగాల్ నిలిచాయి) 
5. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదాని, సావిత్రి జిందాల్
6. 13 ఏళ్లగా కోమాలో ఉన్న హరీష్ రానా 
7. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా (అత్యున్నత నాయకుడు) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎంపికయ్యారు. 2026 మార్చిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, నిపుణుల అసెంబ్లీ ద్వారా 56 ఏళ్ల మొజ్తాబా ఈ పదవికి ఎంపికయ్యారని ఇరాన్ ప్రభుత్వ మీడియా మరియు వివిధ వర్గాలు నివేదించాయి. 
8. 22వ విడత 
9. A, B, C, D 
10. మొల్ల (ఈ నెల 13న ఆమె జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది) 
11. మనమిత్ర 
12. యాట అన్నదాతకు 20వేల ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్లో 4685838 మంది రైతులకు లబ్ది 
13. శ్రీ సత్య సాయి జిల్లా 
14. 4 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో 
15. 13 ఏళ్ల లోపు 
16. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు లెక్కల్లో చూపని భారీ నగదు లభ్యమైన ఘటనలో, జస్టిస్ యశ్వంత్ వర్మ 2025లో వార్తల్లో నిలిచారు. ఈ వివాదం తర్వాత ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
17. జువ్వల దీన్నే లో 
18. కెనడా (260 కోట్ల డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది) 
19. శాంతి (SHANTI) బిల్లు పూర్తి రూపం: Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India (శాంతి). తెలుగులో, ఇది భారతదేశ పరివర్తన కోసం అణుశక్తి యొక్క స్థిరమైన వినియోగం మరియు అభివృద్ధి బిల్లు, 2025
20. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 
21. పంజాబ్- హర్యానా 
22. గవర్నర్ 
23. 17
24. 56 సంవత్సరాలు 
25. రెండవ పులోమావి