1. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఎప్పుడు జన్మించారు
2. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను ఏ రోజున ప్రారంభించడం జరిగింది
3. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు ఏ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం జరిగింది
4. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ రెండు నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం
5. ఇటీవల వార్తల్లో నిలిచిన క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ - సిఈ20 ని ఎవరు రూపొందించారు
6. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాగా ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం దేనిని ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించడం జరిగింది. దీని ఏర్పాటు కోసం ఏ విదేశీ విశ్వవిద్యాలయం పాల్గొంటుంది
7. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆ దేశానికి ఇన్నోవా అధ్యక్షుడు
8. తమిళనాడులో జయలలిత అనుచరురాలు అయిన శశికళ ఆల్ ఇండియా పురట్చి తలైవార్ మక్కల్ మునేట్ర కలగం పార్టీని స్థాపించారు అయితే ఈ పార్టీ గుర్తు
9. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తొలి కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స విజయవంతం అయింది అయితే ఎవరికి ఈ చికిత్స విజయవంతంగా చేయడం జరిగింది
10. 60వ జ్ఞానపీఠ అవార్డును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించడం జరిగింది
11. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? A: ఇటీవల కేంద్ర ప్రభుత్వం 60వ జ్ఞానపీఠ అవార్డును 2025 సంవత్సరానికి గాను ప్రకటించడం జరిగింది. B: ఈ 60వ జ్ఞానపీఠ అవార్డును తమిళ నాడు రచయితకు ఇవ్వడం జరిగింది. C: అతనికి 2003లో పద్మశ్రీ సాహిత్య అకాడమీ 2014లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. D: తమిళనాడు నుంచి జ్ఞానపీఠ అవార్డు పొందిన మూడవ వ్యక్తి ఇతను. E: ఇతనకు 11 లక్షల నగదు సరస్వతీకాంశయావిగ్రహం ప్రశంస పత్రం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది
12. ప్రస్తుత సెబి చైర్మన్
13. ఇటీవల భారత్ తరపున 94వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు పేరు పొందారు
14. బీసీసీఐ యొక్క జీవిత సాఫల్య పురస్కారంనీకీ ఇటీవల ఎంపికైన మహిళ క్రికెటర్ ఎవరు
15. ఇటీవల బీసీసీఐ రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడులకు ఏ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది
16. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? A: బీసీసీఐ ప్రకటించే ఉత్తమ క్రికెటర్ గా టీమిండియా టెస్ట్ వన్డే జట్ల కెప్టెన్ సుభమాన్ గిల్ కు పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకోవడం జరిగింది అయితే ఇది తొలిసారి మాత్రమే అందుకున్నాడు. B: బీసీసీఐ ప్రకటించే ఉత్తమ క్రికెటర్ అవార్డును ఎస్ మందన కూడా ఉత్తమ క్రికెట్ అవార్డును ఐదోసారి స్వీకరించడం జరిగింది C: నిరుడు మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ ఎస్ మందన
17. ఈ క్రింది ఇచ్చిన రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను జతపరచండి? A:అస్సాం B: తమిళనాడు C:పశ్చిమ బెంగాల్ D:కేరళ E:పుదుచ్చేరి. 1:294, 2: 234, 3:140, 4:126, 5:30
18. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అయితే ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో రెండు విడతలగా ఎలక్షన్ జరగనుంది
19. ఏ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు
20. తూర్పుగోదావరి జిల్లా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల ఎన్ని అడుగుల కాంస్య విగ్రహాన్ని రూపొందించారు
21. అమరావతిలో ఎన్ని ఎకరాలు 58 అడుగుల పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది
22. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను ఎక్కడ ప్రారంభించడం జరిగింది
23. తెలుగు మాట్లాడే వారందరి కోసం ఒక రాష్ట్రం ఉండాలని తొలిసారిగా 1951 మార్చి 16న గొల్లపూడి సీతారామశాస్త్రి ఏ జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి వినోబాభావే జోక్యంతో 35వ రోజున విరమించడం జరిగింది
24. రష్యా ఉక్రేన్ యుద్ధం ఏ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమైంది
25. గుంటూరు జిల్లా లో గల ఏ చెరువు అభివృద్ధి నమోనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు
26. దేశంలో ప్రత్యేక మెడ్ టెక్ క్యాపిటల్ నిధిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. దీని ఏ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది
27. ఇటీవల చైనీస్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ లో ఎవరు విజయం సాధించారు
28. ప్రస్తుత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, మరియు గవర్నర్ ఎవరు
29. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్ ఎవరు
30. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం సార్వజనేన వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది మరియు రాజ్యాంగంలో ఏ భాగంలో కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి కలదు
Answers:-
1. 1901 మార్చి 16 (ఇటీవల 125వ జయంతి జరగడం జరిగింది)
2. 1952 అక్టోబర్ 19
3. జూన్ 4, 2008 న నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
4. భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం
5. ఇస్రో
6. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, దీని ఏర్పాటు కోసం నెదర్లాండ్ కి చెందిన వాగేనిoగేన్ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థ భాగస్వామ్యం గా పాల్గొంటుంది
7. 47
8. కొబ్బరి తోపు
9. హేమ శ్రీ
10. R. వైరముత్తు
11. A B C D E సరైనవి
12. తుహిన్ కాంత్ పాండే
13. 17 ఏళ్ల మాయంక్ చక్రవర్తి (భారత్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు)
14. మిథాలీ రాజ్
15. కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం
16. B మాత్రమే సరైనది (సుమన్ గిల్ రెండవసారి అవార్డును పొందడం జరిగింది మరియు నిరుడు మహిళల ఉండే ప్రపంచం గెలిచిన జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్)
17. అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమ బెంగాల్ 294, కేరళ 140, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలు కలవు
18. పశ్చిమ బెంగాల్
19. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్
20. 8 అడుగులు
21. 6.8 ఎకరాలు (ఈ విగ్రహానికి 26 టన్నుల కాంస్యo 42 టన్నుల ఇనుము వాడినట్లు వివరించారు మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 150 కోట్లు)
22. మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంటిదగ్గర
23. గుంటూరు జిల్లా
24. 2022 ఫిబ్రవరి 24
25. వెంగళాయపాలెం
26. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్, మేడ్ ఆర్థ క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో
27. కిమి అంటోనెలి (ఇటలీ)
28. మార్చి 2026 నాటికి పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), గవర్నర్ ఆర్.ఎన్. రవి (R.N. Ravi).
29. మార్చి 17, 2026 నాటికి, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ (7 మే 2021 నుండి) మరియు ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ (12 మార్చి 2026 నుండి).
30. ఆర్టికల్ 326 (రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి 15వ భాగంలో కలదు)