Back to Current Affairs

17/03/2026 questions

1. 98వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం సహా ఆరు పురస్కారాలను గెలుచుకున్న చిత్రం ఏది 
2. 98వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఎక్కడ జరిగాయి 
3. 98వ ఆస్కార్ అవార్డు ఉత్తమ నటిగా ఎవరు ఎంపికయ్యారు
4. 98వ ఆస్కార్ అవార్డు ఉత్తమ నటుడు ఎవరు 
5. అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం కి ఏమి పేరు పెట్టడం జరిగింది 
6. ఒంటిమిట్టలోని గల కోదండ రామాలయం ఏ జిల్లాలో కలదు 
7. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ ఎవరు 
8. నేపాల్ లో ఇటీవల అధికారం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత ఎవరు 
9. ఇటీవల ఏ క్షిపణి వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు (భారత వైమానిక దళానికి చెందినది) 
10. ఇటీవల ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్, భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికవ్వడం జరిగింది
11. ఏప్రిల్ లో ఇండియన్ ఓపెన్ పికిల్ బాలుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది అయితే ఈ టోర్నీ ఎక్కడ జరగనుంది ఏ నగరంలో
12. ఇటీవల వార్తల్లో నిలిచిన కర్ణాటక స్పీకర్ ఎవరు 
13. రేపటి నుంచి దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం(ఐదు రకాల బస్సుల్లో) కల్పించనున్నారు అయితే ఈ పథకానికి ఏం పేరు పెట్టడం జరిగింది (గతంలో ఇంద్రధనస్సు గా పేర్కొన్న పథకాన్ని మార్చడం జరిగింది గమనించగలరు)
14. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం 
15. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 2025 గాను 24 భాషల్లో ఉత్తమ రచనలు చేసిన వారికి 24 మందిని ఎంపిక చేయడం జరిగింది అయితే తెలుగులో ఎవరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2025 గాను ఇవ్వడం జరిగింది 
16. ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 39 సి ఏమిటి చెబుతుంది 
17. ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 ఈ ఏమిటి చెపుతుంది 
18. కాకతీయ వల్లభ అనే బిరుదు ఎవరికి కలదు 
19. ఇక్ష్వాకులలో అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరు
20. ఇక్ష్వాకులు పురాణాల ప్రకారం ఏడుగురు రాజులు కలరు అయితే శాసనాల ప్రకారం ఎంత మంది రాజులు కనిపించడం జరుగుతుంది 
21. విష్ణుకుండున లలో అత్యంత సుప్రసిద్ధ రాజు ఎవరు 
22. ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవసాయ బడ్జెట్ 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంతగా ప్రకటించడం జరిగింది 
23. జనవరిలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎన్నవది 
24. బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.
25. ఫ్రాన్స్ లో ఎన్నేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించడం జరుగుతుంది (సెప్టెంబర్ లో మొదలయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్  ప్రకటించారు)
26. ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి నూతన కార్యాలయం (భవనం పేరు) ఏమిటి
 

Answers:- 
1. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 
2. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ దియేటర్ 
3. జెస్సీ బాక్లి ( హేమ్నెట్)
4. మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
5. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ 
6. వైయస్సార్ కడప జిల్లా 
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని వేయడం జరిగింది
8. బాలేంద్ర షా 
9. పెచోరా క్షిపని వ్యవస్థ (1970 లలో ప్రవేశపెట్టిన భారత వైమానిక దళానికి చెందిన ఈ క్షిపని వ్యవస్థను స్వదేశీ అగ్రేడ్ ద్వారా విజయవంతంగా పూర్తిగా డిజిటలైజ్ చేశారు. పెచోరా అనేది ఉపరితలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ)
10. బీహార్
11. హైదరాబాద్ 
12. U.T. ఖాదర్ 
13. దివ్యాంగ శక్తి 
14. డిసెంబర్ 3 
15. ప్రముఖ కవి రచయిత సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి ( ఆయన రచించిన కవితా సంపుటికి అనిమేష కు ఈ పురస్కారం లభించింది)
16. సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం 
17. మత, భాషా, ప్రాంతీయ లేదా వర్గ బేధాలకు అతీతంగా, భారతదేశ ప్రజలందరిలో సామరస్యాన్ని, ఉమ్మడి సోదరభావాన్ని (Brotherhood) పెంపొందించడం మరియు మహిళల గౌరవాన్ని కించపరిచే ఆచారాలను త్యజించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి 
18. ప్రోలారాజు ( కాకతీ వల్లభ' (లేదా కాకతీ వల్లభుడు) అనే బిరుదు మొదటి ప్రోలరాజుకు కలదు. ఇతడు మొదటి బేతరాజు కుమారుడు మరియు కాకతీయ వంశంలో ఒక ప్రముఖ పాలకుడు. )
19. ఎహువాల శాంతామణుడు 
20. 4
21. మాధవ వర్మ 
22. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ₹53,752.12 కోట్ల భారీ బడ్జెట్‌ను (వ్యవసాయ బడ్జెట్) కేటాయించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ నిధులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు,
23. 56
24. బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్
25. ఫ్రాన్స్‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే చట్టాన్ని ఆ దేశ ప్రభుత్వం తీసుకొస్తోంది
26. సేవాతీర్ద్