Back to Current Affairs

18/03/2026 questions

1. పురుషుల, మహిళల హాకీ ప్రపంచ కప్ లు ఆగస్టు 15 నుంచి 30 వరకు ఏ రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి 
2. ఏపీ ప్రభుత్వం సాహిత్యం సంగీతం నృత్యం సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో చేసిన సేవలు గుర్తించి ఎంత మందినీ కళా రత్న, ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ఎంపిక చేసింది
3. ఏ సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్య భీమా కల్పించడం ప్రభుత్వం ప్రాధాన్య అంశం అని (ఆ సంవత్సరం నాటికి అది సకారం అవుతుంది) కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో తెలిపారు
4. దత్తత బిడ్డ వయసు ఎంతైనా ప్రసూతి సెలవులకు తల్లి ఆ అర్హురాలే అని ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఎన్ని నెలల్లోపు వయసు ఉన్నా దత్తత ఉన్నవారికి మాత్రమే ప్రసూతి సెలవులు గల నిబంధనను కొట్టివేయడం జరిగింది
5. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఎన్ని రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం కల్పించనుంది
6. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏమిటి వివరిస్తుంది 
7. రామాయణంలో సుందరకాండ ఏకాండ తర్వాత జరుగుతుంది 
8. శాతవాహన రాజు అయిన ఎవరికి శిశుక, సిందుక, సిప్రక, సుద్ర చిముక అనే భిన్న రూపాలలో పేర్లు కలవు
9. ఫ్రాన్స్ దేశం నుంచి కొత్తగా మరో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది 
10. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం ఎన్ని కోట్లను కేటాయించడం జరిగింది (2026 27 బడ్జెట్లో) 
11. రుతుక్రమ ఆరోగ్యాన్ని ఏ హక్కుగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది 
12. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏ పేరుతో అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది 
13. భారతదేశపు మొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ను దేశంలో ఏ నగరంలో తీసుకురావడం జరుగుతుంది 
14. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారు(AP FIRST)
15. am గ్రీన్ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది
16. కేంద్ర ప్రభుత్వ మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ పై ఏ రాష్ట్రం నుంచి కోటి కోర్సులను నమోదు చేసుకోగా 80 లక్షల కోర్సులు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఇటీవల ఏది నిలిచింది
17. 2026 డిసెంబర్ 5 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా ఏ ప్రాంతంలో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు(తొలిసారిగా 16 సంవత్సరాల లోపు బాలలతో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు)
18. కుష్టి రోగాన్ని నోటిఫై వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఏ సంవత్సరం నాటికి సంక్రమణ వ్యాధులను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది
19. మణిపూర్ నూతన సీఎంగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు 
20. ఇటీవల ఏ నదిపై కుమార భాస్కర వర్మ సేతు ను ప్రధాని ప్రారంభించడం జరిగింది 
21. ఏ రాష్ట్ర పాఠశాలలో ఏఐతో ప్రవేశ పరీక్షల శిక్షణ ప్రారంభించడం జరిగింది 
22. ఇటీవల డ్రైవర్ రహిత మెట్రో రైల్ ట్రయల్ రన్ ఏ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేశారు
23. ప్రస్తుత ఆర్.బి.ఐ రెపోరేట్ ఎంత (బ్యాంకులకు ఆర్బిఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో రేటు)
24. ప్రపంచ అవినీతి సూచి 2025లో భారత్ స్థానం ఎంత (జర్మనీకి చెందిన ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ ఇటీవల తన నివేదికను రిలీజ్ చేసింది) 
25. బాధ్యతాయుత దేశాల సూచీలో భారత్కు ఎన్నో స్థానం లభించింది (వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఈ సూచీ ని రూపొందించింది)
 

Answers:- 
1. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి
2. 161(ఇందులో కళా రత్నాకు 38 మంది ఉగాది పురస్కారాలు 123 మంది ఎంపికయ్యారు) 
3. 2033
4. మూడు నెలల లోపు వయసు నిబంధనను కొట్టివేసిన సుప్రీంకోర్టు 
5. ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా అందించనున్నారు 
6. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను (Right to Life and Personal Liberty) ప్రాథమిక హక్కుగా హామీ ఇస్తుంది. "చట్టం నిర్దేశించిన విధానం ప్రకారం తప్ప, ఏ వ్యక్తి తన ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు" అని ఇది స్పష్టంగా చెబుతోంది. ఇది గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పిస్తుంది. 
7. కిష్కిందకాండ 
8. శ్రీముఖుడు 
9. 114
10. 1000 కోట్లు 
11. ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 కిందకు వచ్చే జీవన హక్కుల భాగం అని వాక్యానించింది 
12. అరణ్యరామం 
13. అమరావతి 
14. తిరుపతి 
15. కాకినాడ 
16. ఆంధ్రప్రదేశ్ 
17. ప్రకాశం జిల్లా ఒంగోలులో 
18. 2030 నాటికి 
19. ఖేమ్ చంద్ సింగ్
20. బ్రహ్మపుత్ర నదిపై (అస్సాం లోని బ్రహ్మపుత్ర నదిపై 3030 కోట్లతో నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు)
21. కేరళ 
22. తమిళనాడు రాజధాని చెన్నైలో 
23. 5.25%
24. 91(భారత్ 39 పాయింట్లు సాధించగలిగింది)(ప్రపంచ అవినీతి సూచి 2025 నివేదిక ప్రకారం డెన్మార్క్ 100కు 89 పాయింట్లు సాధించి అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది తదుపరి రెండు స్థానాల్లో ఫిన్లాండ్, సింగపూర్లకు దక్కాయి. దక్షిణ సుడాన్, సోమాలియా దేశాలు ప్రపంచ అవినీతి సూచి 2025లో చెరో తొమ్మిది పాయింట్లు తో అట్టడుగున నిలిచాయి)
25. 16వ స్థానం