1. కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలకు సంబంధించి SIR ను చేపడుతుంది అయితే SIR అనగా ఫుల్ ఫామ్
2. దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు 33,600 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు
3. ఇటీవల విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల ద్వారా వినియోగదారులకు న్యాయం అందించడంలో దేశంలోనే 19 పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానం నిలిచింది
4. ఇటీవల జరిగిన ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికలలో ఆ దేశ నియంత ఎవరు తిరుగులేని మెజారిటీతో గెలుపొందడం జరిగింది (99.93 శాతం ఓట్లతో విజయం సాధించడం జరిగింది)
5. HD దేవగౌడ భారతదేశానికి ఎప్పటినుండి ఎప్పటి వరకు ప్రధాన మంత్రిగా పనిచేశారు మరియు ఎన్నవా ప్రధానంగా పని చేయడం జరిగింది
6. కేంద్ర బడ్జెట్ 2026 27 ప్రకారం బయో ఫార్మా శక్తి పథకాన్ని రూపొందించింది అయితే భారతదేశాని ప్రపంచ బయో ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాబోయే ఐదేళ్లకి ఎన్ని కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని రూపొందించారు(మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లను ఏర్పాటు చేసి బయో ఫార్మశక్తి పథకంతో అనుసంధానిస్తారు)
7. తూర్పు చాళుక్యుల రాజవంశంలో మొదటి రాజు ఎవరు
8. ఏ రాజు కాలం నుండి తూర్పు చాళుక్యులకు (వేంగి చాళుక్యులు), పల్లవులకు మధ్య ఘర్షణలు ప్రారంభం అవడం జరిగింది
9. తూర్పు చాళుక్యల్లో ఏ రాజు 360 యుద్ధాలు చేసినట్లు మల్లపదేవుని పిఠాపురం శాసనంలో ద్వారా తెలుస్తుంది
10. తూర్పు చాళుక్య రాజుల అందరిలో అగ్రగన్యుడు మహా పరాక్రమ శాలి ఎవరు
11. శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు
12. శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన వేదసిరికి మరొక పేరు ఏమిటి
13. శాతవాహనులలో దక్షిణపదేశ్వర అనే బిరుదు ఎవరికి కలదు
14. శాతవాహనులలో దక్షిణ పదాధిపతి అనే బిరుదు ఎవరికి కలదు
15. జాతీయ బాలిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం
16. పరాక్రమ దివాసును జనవరి 23న ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది
17. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుందా? ఉండదా?
18. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలా?
19. ఆర్థిక బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలా?
20. గంగా నది చివరిగా ప్రవహించే రాష్ట్రం యొక్క ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు ఎన్ని
21. కర్కాటక రేఖ భారతదేశంలో ప్రయాణించే తొలి రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని(కర్కాటక రేఖ మొదలయ్యే రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు)
22. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది
23. పారిశ్రామిక తీర్మానం 1977ను ఎవరు ప్రకటించడం జరిగింది (దీనిలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది)
24. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఏ సంవత్సరం చేయబడింది
25. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది
26. వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయడం జరిగింది
27. డిమాండ్ మారకుండా సప్లై భారీగా పడిపోతే అట్లాంటప్పుడు పెరిగే ధరలను ఏ ఇన్ఫ్లేషన్ అందరూ
28. భారత్లో పేదరికం లెక్కించే అధికార సంస్థ ఎన్ఎస్ఎస్ఓ (NSSO) ఫుల్ ఫామ్
29. రాష్ట్ర బిల్లును గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది
30. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటిస్తే పార్లమెంటు ఎన్ని నెలల లోపు ఆమోదించాలి
Answers:-
1. Special Intensive Revision
2. 100
3. ఆంధ్రప్రదేశ్ (మొత్తం 10 మార్కులకు గాను 6.28 మార్కులు సాధించి తొలి ర్యాంకు సొంతం చేసుకుంది తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక పశ్చిమబెంగాల్ నిలిచాయి. 19వ స్ధానం తెలంగాణ నిలిచింది)
4. కిమ్ జోంగ్ ఉన్
5. జూన్ 1,1996 to ఏప్రిల్ 20,1997( 12వ భారత ప్రధాని)
6. 10,000 కోట్ల రూపాయలు
7. కుబ్జ విష్ణువర్ధనుడు
8. జయసింహవల్లభుడు
9. చాళుక్య భీముడు
10. గుణగ విజయాదిత్యుడు
11. నాగానికాదేవి
12. పూర్ణోత్సంగ
13. రెండో పులోమావి/ వాసిష్టపుత్ర పులోమావి
14. మొదటి శాతకర్ణి
15. జనవరి 24
16. సుభాష్ చంద్రబోస్
17. రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం తెలపడంలో రాష్ట్రపతికి ఎలాంటి వీటో (Veto) అధికారం లేదు. 1971 నాటి 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, పార్లమెంట్ ఆమోదించిన సవరణ బిల్లుపై రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం (ఆమోదముద్ర) చేయాలి. బిల్లును వెనక్కి పంపడం లేదా నిలిపివేయడం ఆయనకు అధికారం లేదు.
18. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి (Prior Recommendation) అవసరం లేదు. ఈ బిల్లులను లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు, కానీ పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, అప్పుడు ఆయన ఆమోదముద్ర వేయాల్సిందే
19. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1) ప్రకారం, ఆర్థిక బిల్లులను (Financial Bills - Category I) పార్లమెంట్‌లో, ముఖ్యంగా లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి సిఫార్సు లేనిదే ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టకూడదు.
20. గంగా నది భారతదేశంలో చివరిగా ప్రవహించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ విధానసభ (అసెంబ్లీ) మొత్తం స్థానాల సంఖ్య 294.
21. రాష్ట్రం మిజోరం. మిజోరం రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 40 (నలభై). ఈ రేఖ మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్ మీదుగా వెళుతుంది.
22. 2016
23. 1977 పారిశ్రామిక తీర్మానాన్ని డిసెంబర్ 23, 1977న మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం తరపున నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రవేశపెట్టారు
24. 1934
25. 2000
26. 1986
27. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ ( Bottleneck inflation)
28. National Sample Survey Office
29. ఆర్టికల్ 201
30. రెండు నెలల లోపు