1. సముద్ర శక్తి నౌకగా నిర్మితమైన ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేసిన భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు మరియు దీనిని తయారు చేసింది ఎవరు (నిర్మించినది)?
Answer: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు దీనిని నిర్మించినది Mazagon Dock Shipbuilders Limited
2. భారత్లో ఆసియా జౌళి సదస్సు 2026 ఏ నగరంలో జరిగింది?
Answer: హైదరాబాద్
3. పత్తి, సిల్క్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఎన్నవ అతి పెద్ద దేశంగా ఉంది?
Answer: రెండవ
4. అణు జలాంతర్గామి అయిన అరిధమాన్ ఎన్నవది (న్యూక్లియర్ జలాంతర్గాములో ఎన్నవది)?
Answer: మూడవది (భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసెల్' (ATV) ప్రాజెక్ట్ కింద శక్తివంతమైన అణు జలాంతర్గాములను నిర్మించింది. ఇందులో భాగంగా INS అరిహంత్ (మొదటిది, 2009), INS అరిఘాట్ (రెండవది, 2024), మరియు మూడవదైన INS అరిధమాన్ (2026 నాటికి) నౌకాదళంలో చేరాయి.)
5. ప్రస్తుత దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు?
Answer: లీ జే-మ్యుంగ్ (Lee Jae-myung)
6. ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు?
Answer: ఇమాన్యుయేల్ మాక్రాన్
7. సమగ్ర పక్షి అట్లాస్ ను ప్రచురించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏమిటి మరియు ఇటీవల సమగ్ర పక్షి అట్లాస్ ను తయారుచేసిన రెండవ రాష్ట్రం ఏమిటి?
Answer: మొదటిది కేరళ, రెండో రాష్ట్రం గోవా
8. సరోజినీ నాయుడు జన్మదినం ఏ రోజున జరుపుకుంటాం?
Answer: ఫిబ్రవరి 13 (జాతీయ మహిళా దినోత్సవం)
9. ఒరాయన్ వ్యోమనౌక ఏ మిషన్ లో భాగంగా జాబిల్లి దిశగా వెళ్ళింది?
Answer: ఆర్టెమిస్ 2
10. ఇటీవల వార్తల్లో నిలిచిన తమిళనాడులో కమల్ హాసన్ యొక్క పార్టీ నేమ్ ఏమిటి?
Answer: మక్కల్ నీది మయం
11. మయన్మార్ దేశ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
Answer: సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ (Min Aung Hlaing) (ఏప్రిల్ 3, 2026న ఎన్నికయ్యారు)
12. NCERT కి ఇటీవల కేంద్ర విద్యా శాఖ ఏ కేటగిరీలో చేర్చింది?
Answer: డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంగా
13. ఇటీవల వార్తల్లో నిలుస్తున్న పార్లమెంట్ ఎంపీ రాఘవ్ చడ్డ ఏ పార్టీకి చెందిన వాడు మరియు పార్లమెంట్లో ఏ సభకు సంబంధించిన ఎంపీ?
Answer: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు
14. విక్రమ్ దొరై స్వామి ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు?
Answer: చైనా
15. అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి తన కెరియర్ లో 900 గోల్స్ చేసిన రెండో క్రీడాకారుడిగా నిలిచారు అయితే మొదటి క్రీడాకారుడు ఎవరు?
Answer: క్రిస్టియానో రోనాల్డో
16. ఒడిస్సా తొలి స్మార్ట్ విలేజ్ గా ఏది అవతరించింది?
Answer: కుసున్‌పూర్
17. మహాశివరాత్రి సందర్భంగా ఏ సంస్థ భవ్య భారత భూషణ్ అవార్డును ప్రారంభించింది?
Answer: ఇషా ఫౌండేషన్
18. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం హింసను విడనాడుట, ప్రజల ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించుట అనే అంశం ప్రాథమిక విధుల్లో కలదు?
Answer: ఆర్టికల్ 51I
19. ప్రాథమిక విధులు ఎప్పటినుండి అమల్లోకి వచ్చాయి?
Answer: 1977 జనవరి 3 నుండి
20. అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
Answer: 1980
21. పౌర హక్కుల చట్టం 1976 అయితే దీనికి ముందు దీని పేరు ఏ చట్టంగా పిలవడం జరిగేది?
Answer: అంటరానితనం నిషేధ చట్టం 1955
22. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మాత శిశువు సంక్షేమం కోసం కృషి చేయాలని, స్త్రీల ఆరోగ్య సంరక్షణకై తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంటుంది?
Answer: ఆర్టికల్ 42
23. సరళ ముద్గల్ కేసులో ఏ అంశం తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూచించింది?
Answer: కామన్ సివిల్ కోడ్
24. రాజ్యాంగం లో ఏ ఆర్టికల్ ప్రకారం భాషాపరమైన మైనార్టీ హక్కుల పరిరక్షణకై ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు?
Answer: ఆర్టికల్ 350(B)
25. నేషనల్ పెన్షన్ స్కీం ఏ సంవత్సరంలో చేయబడింది?
Answer: 2013
26. వృద్ధాప్య పెన్షన్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
Answer: 1995
27. ఆరవ పంచవర్ష ప్రణాళిక అమలు సమయంలో భారతదేశంలో ప్రధాన మంత్రులుగా ఎవరు పనిచేస్తున్నారు?
Answer: ఇందిరా గాంధీ (1980–1984), రాజీవ్ గాంధీ (1984–1985)
28. రాజీవ్ గాంధీ తో ప్రమాణ స్వీకారం చేయించిన భారత రాష్ట్రపతి ఎవరు?
Answer: గియానీ జైల్ సింగ్
29. సంపదపై పన్ను చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
Answer: 1957
30. భారత తొలి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
Answer: K.C. Neogy