1. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్పుని భారత టీం గెలుచుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లు ఎన్ని జరిగాయి
2. ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ ఏ ఏ సంవత్సరాల మధ్యన అమలు జరగనుంది
3. ఇటీవల ఏ దేశం కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ వార్తల్లో నిలిచింది(వలసదారులు విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానికి ఉన్న హక్కులు గురించి తెలిపేదే ఈ కఫాలా వ్యవస్థ)
4. ఇటీవల ఏ దేశంలో పదహారేండ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధిస్తూ వార్తల్లో నిలిచింది
5. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణస్వీకారం చేశారు
6. నవంబర్ 15న ఇటీవల జన్ జాతీయ గౌరవ దివాసును జరుపుకోవడం జరిగింది అయితే ఎవరి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం (150వ జయంతి నవంబర్ 15న జరిగింది)
7. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు చర్చించడానికి ఎవరి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది
8. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ అనే నామకరణంతో ఎన్ని అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు
9. దేశంలోనే అత్యంత పేదరికం నిర్మూలించిన తొలి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది
10. ఇటీవల ఏ రైల్వేస్టేషన్లో మొత్తం మహిళలే నిర్వహించిన రైల్వే స్టేషన్గా పేరు నమోదు చేసుకుంది
11. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత
12. చంద్రయన్ 2 మిషన్ ను ఏ సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది
13. డిఎన్ఏ పితామహుడు ఎవరు? ఇటీవల ఆయన మరణించడం జరిగింది
14. తృణములు కాంగ్రెస్ mla అయినా ముకుల్ రాయ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయడం జరిగింది ఇలా హైకోర్టు ఒక ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడం ఇదే తొలిసారి అయితే ఏ హైకోర్టు ఇలా రద్దు చేయడం జరిగింది
15. 2025 బుకర్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగింది
16. కిరణ్ దేశాయికి ఏ సంవత్సరంలో బుకర్ ప్రైస్ రావడం జరిగింది (ది ఇన్ హెరిటేన్స్ ఆఫ్ లాస్ నవలకు గాను)
17. రాష్ట్రీయ విజ్ఞాన్ రత్న 2025 పురస్కారం ఎవరికి వచ్చింది
18. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న ఏ క్రీడకు చెందిన వ్యక్తి
19. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేత ఎవరు
20. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం (2025 theme hand in hand for better foods and a better future)
21. ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం
22. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు 11 కలిపితే ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు వస్తాయి
23. విధాన పరిషత్తు ఉన్న రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి
24. అత్యధిక విధాన పరిషత్తు స్థానాలు ఉన్న రాష్ట్రం ఏమిటి
25. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది
Answers:-
1. 13(ఆస్ట్రేలియా ఏడుసార్లు ఇంగ్లాండ్ 4 సార్లు న్యూజిలాండ్ ఒకసారి భారత్ ఒకసారి మహిళా క్రికెట్ వన్డేవరల్డ్ కప్పులు గెలిచాయి)
2. 2025-2030
3. సౌదీ అరేబియా
4. ఆస్ట్రేలియా
5. Sanae Takaichi
6. బిర్సా ముండా
7. అపరాజిత సారంగి
8. 58
9. కేరళ
10. లక్నోలో సిటీ రైల్వే స్టేషన్
11. 86(143 దేశాలుగాను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన నివేదిక ప్రకారం)
12. 2019 జూలై 22
13. జేమ్స్ డి వాట్సన్
14. కలకత్తా హైకోర్టు
15. డేవిడ్ సలై (ప్లేష్ అనే నవలకు)(కిరణ్ దేశాయ్ ఈసారి బుకర్ ప్రైజ్2025 గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు ఆమె రాసిన నవల ది లోన్లినెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ)
16. 2006
17. జయంత్ విష్ణు నర్లీకర్
18. టెన్నిస్ (2017 ఫ్రెంచ్ మిక్స్డ్ డబల్ ట్రోపీ 2024 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీ 43 ఏళ్ల వయసులో గెలుచుకున్నారు)
19. దబాంగ్ ఢిల్లీ (పుణేరీ పల్టాన్ జట్టుపై)
20. అక్టోబర్ 16
21. అక్టోబర్ 24
22. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 దీనికి 11 కలిపితే 81 ఝార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి
23. ప్రస్తుతం విధాన పరిషత్తు ఆరు రాష్ట్రాల్లో కలదు ఉత్తర ప్రదేశ్ 100 స్థానాలు,మహారాష్ట్ర 78 స్థానాలు,బీహార్ 75 స్థానాలు, కర్ణాటక 75 స్థానాలు, ఆంధ్ర ప్రదేశ్ 58 స్థానాలు, తెలంగాణ 40 స్థానాలు. అయితే ఈ రాష్ట్రాలలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రం తెలంగాణ 119 ఎమ్మెల్యే స్థానాలు కలవు)
24. ఉత్తర ప్రదేశ్ 100 MLC స్థానాలు కలవు
25. ఆర్టికల్ 214