1. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ ఘన విజయం సాధించింది
2. కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయనికి ఏమి పేరు పెట్టారు
3. కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని 2029 మార్చినాటికి లక్ పతి దీదీల సంఖ్యను ఎంతకు పెంచాలని లక్ష్యంతో ఉన్న ఫైల్ పై సంతకం పెట్టడం జరిగింది(అలాగే పీఎం రాహత్ పథకం యొక్క ఫైల్ పై సంతకం పెట్టడం జరిగింది)
4. భద్ర పులుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు
5. ఇటీవల జరిగిన బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని స్థానాలకు జరిగాయి
6. రాష్ట్రంలో గంజాయి మాదకద్రవ్యాల పై ఉక్కు పాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం అధిపతి ఎవరు
7. ఆంధ్రప్రదేశ్లోని కొండవీటి కోట 14వ శతాబ్దానికి చెందిన దిగ్గజ వారసత్వ స్మారక చిహ్నం. రెడ్డి రాజుల రాజధాని. అయితే ఇది ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు
8. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి ఎన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది
9. భారత తీర రక్షక దళం రూపొందించిన మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది(గోవా షిప్ యాడ్ లిమిటెడ్ లో ఈ నౌకను నిర్మించారు)
10. ఆస్ట్రేలియా విక్టోరియా యూనివర్సిటీ తన మొదటి భారతీయ క్యాంపస్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
11. ఎన్ని కోట్ల మూల నిధితో స్టార్టప్ ఇండియా 2.0 పథకాన్ని ప్రారంభించనున్నారు (2016లో 10,000 కోట్ల తో స్టార్ట్ ప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది)
12. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది ఈ నిధి పేరు ఏపీ వెల్త్ ఫండ్ అయితే ఎన్ని కోట్లతో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు (నార్వే, అబుదాబి సావరిన్ నిధులు మాదిరి విధానాన్ని అనుసరించాలని)
13. నూతన బంగ్లా ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు (ఇతని ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ హోo బిర్లా హాజరయ్యారు)
14. ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన ఎవరికి సంబంధించిన పథకం
15. AI ఇంపాక్ట్ సమ్మిట్ భారతదేశంలో ఫిబ్రవరి 16 నుంచి 20 తేదీల్లో ఎక్కడ జరిగింది
16. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కార్య క్రమం ముఖ్య ఉద్దేశం
17. భారత్ శ్రీలంకలో జరుగుతున్న టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు
18. ఆంధ్రప్రదేశ్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎన్ని అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు
19. ఎన్టీఆర్ విద్యలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంఘంలో మహిళల కోసం ఏర్పాటు చేసింది(ఒక్కో పథకానికి ఏడాదికి 1000 కోట్ల చొప్పున రెండిటికి 2000 కోట్లు ఖర్చు చేయనున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు)
20. స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ప్రకారం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతను ఎంత శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
21. మార్చి 14, 15 తేదీల్లో ఏ రాష్ట్రంలో దక్షిణాది న్యాయమూర్తుల సమావేశం జరగనుంది
22. పరిశ్రమ నిర్వచనాన్ని తేల్చేందుకు ఇటీవల ఎంతమంది జడ్జీలతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది(పారిశ్రామిక వివాదాల చట్టం 1947 లోని ఉన్న పరిశ్రమ (ఇండస్ట్రీ) అనే పదం నిర్వచనంపై 1978 నుంచి పలు ధర్మాసనాలు విచారణ జరిపాయి అయినప్పటికీ అస్వష్టత తొలగిపోలేదు ఈ నేపథ్యంలో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది)
23. ప్రధాని మోడీ ఈనెల 25 26 తేదీల్లో ఇజ్రాయల్లో పారేటించనున్నారు అయితే ప్రధాని మోదీ తొలిసారిగా ఏ సంవత్సరంలో ఇజ్రాయిల్ లో పర్యటించారు
24. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూ (IFR)మరియు మిలాన్ విన్యాసాలు జరిగాయి
25. ఇటీవల నరేంద్ర మోడీ ఫ్యాన్స్ అధ్యక్షుడు తో కలిపి ఎయిర్ బస్ హెచ్ 125 హెలిక్యాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ను ముంబై నుంచి ఒర్చువల్గా ప్రారంభించారు అయితే ఈ అసెంబ్లింగ్ యూనిట్ ఎక్కడ కలదు
26. భారతదేశంలో ఇటీవల పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు (భారత్, ఫ్రాన్స్ దేశం తో 21 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.)
27. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో మూలపేట వద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మిస్తున్నారు
28. ఇటీవల ఏ దేశంలో చట్టసభ సభ్యులు పదవీ కాలం ముగిశాక (అనంతరం) పింఛన్ లు తీసుకోకుండా నిర్ణయించడం జరిగింది
29. తమిళనాడులో ఈ సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్లు జరగబోతున్న సందర్భంగా ఆ రాష్ట్రంలో ఎన్ని కోట్లతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది
30. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఓటాను అకౌంట్ బడ్జెట్ గురించి వివరిస్తుంది
31. ఐఎంఎఫ్ భారత వృద్ధిరేటును 2025 కు గాను ఎంత శాతం అంచనా వేసింది
32. ఐఎంఎఫ్ భారత అభివృద్ధి రేటు 2026 గాను ఎంత శాతం ముందస్తు అంచనా వేసింది (2027 సంవత్సరానికి గాను అంతే శాతం అంచనా వేసింది)
33. ఇటీవల వార్తల్లో వినబడుతున్న ఆరెంజ్ ఎకానమీ అనగానేమి?
34. గతేడాది అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం సాధించింది(2025లో ఏపీ టీడీసీకి గ్లోబల్ టూరిజం అవార్డు కూడా లభించింది)
35. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పడింది (ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. AP TDC)
36. భారత తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక అయిన దేనిని ఇటీవల జల ప్రవేశం చేసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి( నౌక పేరు)
37. తుఫాన్లు అంచనాకు మరింత ముందస్తుగా అంచనా వేసేందుకు హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ విశ్వవిద్యాలయంతో కలిపి పరిశోధనలు చేస్తుంది
38. బయో- ఆసియా 2026 సదస్సు భారతదేశంలో ఏ నగరంలో జరుగుతుంది
39. ఏ సంవత్సరాన్ని భారత్ స్పెయిన్ సంస్కృతిక పర్యాటక ఏఐ సంవత్సరంగా గుర్తిస్తున్నారు (ఇటీవల స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో సాంచేజ్ భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ప్రకటించారు)
40. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల AI హబ్ ను గూగుల్ ఏర్పాటు చేస్తుంది
41. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో AI ట్యూటర్ ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఏ ఐఐటి తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది
42. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి
43. ప్రస్తుత ఐఎంఎఫ్ చీఫ్ ఎవరు
44. బ్యాంకులు కు వెళ్లకుండానే డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఆన్లైన్ పోర్టల్ ను ఇటీవల ప్రారంభించిన బ్యాంకు ఏమిటి
45. ఇటీవల ఏ రాష్ట్రము దేశవాళి క్రికెట్ అయినా రంజీ ట్రోఫీ ఫైనల్ తొలిసారిగా ఆడబోతున్న టీం ఏమిటి
46. తుఫానులను కచ్చితంగా అంచనావేసి ఆధునిక పరికరాన్ని దేశంలోనే మొదటిసారిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించింది అయితే ఇది ఎక్కడ కలదు
47. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంప్లానన్ ఎన్ఎక్స్టి అనే ఆధునిక గర్భనిరోధక పరికరాన్ని మహిళలకు ఉచితంగా అమరుస్తున్నారు
48. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది
49. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరాల మధ్య జరిగింది ఏ సంధితో ముగిసింది
50. ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో లోక్సభ స్థానాలు ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏమిటి
Answers :-
1. బంగ్లాదేశ్ నేషనల్స్ట్ పార్టీ (BNP)
2. సేవా తీర్ద్
3. ఆరు కోట్లకు
4. కర్ణాటక
5. బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 350 సీట్లు కలవు. అందులో 50 సీట్లును మహిళలకు రిజర్వ్ చేశారు. ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి మరణించడం చేత 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి
6. Ake Ravi Krishna
7. పల్నాడు జిల్లా
8. పదివేల కోట్లు
9. సముద్ర ప్రతాప్
10. గురుగ్రామ్
11. పదివేల కోట్లతో
12. 100 కోట్లు
13. తారీక్ రెహమాన్
14. మైనారిటీల సంక్షేమానికి సంబంధించి
15. ఢిల్లీలోని భారత మండపంలో
16. 2025–26 ఆర్థిక సంవత్సరం నుండి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ప్రారంభించబడిన ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF), పోటీతత్వ, మార్కెట్ ఆధారిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా స్థితిస్థాపక, సమ్మిళిత మరియు వాతావరణ-ప్రతిస్పందించే నగరాలను పెంపొందించడంలక్ష్యంగా పెట్టుకుంది .
17. నిశాంక (శ్రీలంక బ్యాట్స్ మాన్)
18. 58 అడుగులు (58 రోజుల దీక్షకు గుర్తుగా)
19. డ్వాక్రా మహిళలకు
20. 100%
21. తెలంగాణ
22. 9
23. 2017 జూలై
24. విశాఖపట్నం
25. కర్ణాటకలోని వేమగల్
26. ఇమాన్యుయోల్ మేక్రాన్
27. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం
28. శ్రీలంక
29. 4,67,264 కోట్లు
30. ఆర్టికల్ 116
31. 7.3%
32. 6.4%
33. ఆరెంజ్ ఎకానమీ, లేదా "సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ" అనేది సృజనాత్మకత, సంస్కృతి మరియు మేధో సంపత్తి (IP)లో పాతుకుపోయిన ఆర్థిక కార్యకలాపాలనుసూచిస్తుంది , ఆలోచనలను డబ్బు ఆర్జించదగిన వస్తువులు మరియు సేవలుగా మారుస్తుంది. ఇది AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్), డిజైన్, ఫ్యాషన్, సంగీతం మరియు డిజిటల్ కంటెంట్వంటి రంగాలను కలిగి ఉంటుంది .
34. 3
35. 1976 Feb 18
36. ఐఎన్ఎస్ కృష్ణ
37. ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు
38. హైదరాబాద్
39. 2026
40. 15
41. ఐఐటీ మద్రాస్
42. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ఆంటోనియో గుటెర్రెస్
43. క్రిస్టాలినా జార్జివా
44. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
45. జమ్ము కాశ్మీర్
46. చెన్నై (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నైలో కలదు)
47. తమిళనాడు
48. తమిళనాడు
49. రెండవ ఆంగ్ల కర్ణాటక యుద్ధం (1749-1754) 1754 సంవత్సరంలో పాండిచ్చేరి సంధి (Treaty of Pondicherry) తో ముగిసింది.
50. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలలో (తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్) అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం తమిళనాడు (39 స్థానాలు)