1. ఏపీ ప్రభుత్వం ఇటీవల జనాభా నిర్వహణ విధానం పై ముసాయిదాను విడుదల చేయడం జరిగింది అయితే ఈ ముసాయిదా ప్రకారం ఇద్దరు అంతకుమించి పిల్లల్ని కంటే రెండో బిడ్డ నుంచి ఒక్కొక్కరికి ఎంత ఆర్థిక సహాయం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు
2. ఏపీ ప్రభుత్వం జనాభా నిర్వహణ విధానం పై రిలీజి చేసిన ముసాయిదా ప్రకారం ఇన్నేళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నారు
3. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? A: ఇటీవల తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్న ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు (బదిలీ అయ్యారు). B:తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల నియమితులయ్యారు. C: కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్లకు పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను అందిస్తుంది
5. ప్రధాని మోదీ గుజరాత్ సీఎం గా ఏ సంవత్సరంలో తొలిసారిగా ప్రమాణస్వీకారం చేశారు
6. ప్రస్తుత ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎవరు
7. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరు
8. ఫిన్లాండ్ దేశం ఏ ఖండంలో భాగం?
9. జనాభా లెక్కల స్వీకరణ ఏ మంత్రిత్వ శాఖ పరిధి కిందకు వస్తుంది
10. 2027 లో చేపట్టబోయే జనాభా లెక్కలు భారతదేశంలో మొత్తంగా ఎన్నో వి మరియు స్వతంత్ర అనంతరం ఎన్నవ జనాభా లెక్కలు చేపట్టనున్నారు
11. భారతదేశం లో తొలిసారిగా ఏ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది(ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షం ప్రవేశపెట్టనుంది)
12. బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ఎన్నిసార్లు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది (ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది)
13. ఇటీవల వార్తల్లో నిలిచిన సుఖోయ్- 30 యుద్ధ విమానాన్ని ఎవరు తయారు చేయడం జరిగింది
14. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం స్పీకర్ను నియమించడం జరుగుతుంది మరియు ఏ ఆర్టికల్ ప్రకారం స్వీకరణ తొలగించడం జరుగుతుంది
15. స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు
17. భారతదేశంలో స్పీకర్తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు
18. హార్పున్ అస్త్రం ఏ దేశానికి సంబంధించినది
19. భారతదేశం ఉపయోగించే వరుణాస్త్ర, శ్యేన ఏ అస్త్రాలు అనేవి ఏమిటి
20. ఇటీవల మరణించిన షేక్ మహబూబ్ సుభాని ఏ రంగంలో ప్రముఖమైన వ్యక్తి (ఈయనకు 2020లో తన సతీమణితో కలిసి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు)
21. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన విద్య- పరిశ్రమల సమ్మేళనం 2026 ఎక్కడ జరుగుతుంది
22. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమితుల అవ్వబోయే జస్టిస్ లిసాగిల్ స్వరాష్ట్రం ఏమిటి
23. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అవ్వబోయే జస్టిస్ లీసా గిల్ ఏ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అవుతున్నారు
24. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం EO గా యొక్క పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి ఎవరు
25. రైసీనా డైలాగ్ - 2026 పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత దేశంలో ఎక్కడ జరుగుతుంది
26. రైసీనా డైలాగ్ - 2026 అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొన్న వ్యక్తి ఎవరు (అతను సాంకేతికత- సుపరిపాలన, భవిష్యత్తు అంశాలపై కీలక ఉపన్యాసం చేస్తారు)
27. 18వ రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కాశ్మీర్ ఫైనల్ లో ఏ జట్టుపై విజయం సాధించింది
28. దేశవాళి క్రికెట్ అయినా రంజీ ట్రోఫీ ఏ ఫార్మేట్ కు సంబంధించినది
29. 18వ రంజీ ట్రోఫీ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వ్యక్తి ఎవరు (ఈ సీజన్లో అతను 60 వికెట్లు తీయడం జరిగింది)
30. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎవరితో కలిసి సమతా పార్టీని స్థాపించారు. (ఈ పార్టీనీ తరువాత జెడియూలో విలీనం చేశారు)
31. ఇటీవల వార్తల్లో నిలిచిన బ్లూ స్పార్ క్షిపనీ ఏ దేశానికి చెందినది
32. నేపాల్ లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) ఎవరి నేతృత్వంలో ఏర్పడింది (ఇటీవల నేపాల్ లో జరిగిన ఎన్నికలలో ఈ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది)
33. టిఆర్పి రేటింగులను వెంటనే ఆపాలని బార్కుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది అయితే టీ ఆర్ పి అనగా ఫుల్ ఫామ్
34. హురుణ్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానం సాధించిన వ్యక్తి ఎవరు
35. హురుణ్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ఆసియాలో తొలి స్థానం సాధించిన కుబేరుడు ఎవరు
36. హురుణ్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచంలోనే తొలిసారిగా వన్ బిలియన్ డాలర్ల మించి సంపద కలిగిన వారి సంఖ్య 4020 కి చేరుకుంది ఇందులో భారతీయులు ఎంతమంది కలరు
37. ఇటీవల జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు
38. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఎవరు అధ్యక్షత వహించారు మరియు ఈ సమావేశం ఎక్కడ జరిగింది
39. భారత తొలి మహిళా సీఎం ఎవరు ఏ రాష్ట్రానికి పనిచేశారు మరియు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేయడం జరిగింది
40. క్విట్ ఇండియా ఉద్యమ రాణిగా ఎవరిని పేర్కొంటాం ఆమె 1934 లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు
41. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్య రేడియో స్టేషన్ నిర్వహించి ఉద్యమాన్ని ప్రజల్లోకి చేరవేసిన మహిళ ఎవరు
42. సుభాష్ చంద్రబోస్ పులుపు మేరకు 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి రాణి ఝాన్సీ రెజిమెంట్ మహిళా విభాగానికి నేతృత్వం వహించిన మహిళ ఎవరు
43. 1857 తిరుగుబాటులో వీరోచితంగా పోరాడి ఏ సంవత్సరంలో ఝాన్సీ లక్ష్మీబాయి మరణించడం జరిగింది
44. 1926 లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ను స్థాపించింది ఎవరు
45. ఈశాన్య భారతంలో నాగ తెగకు చెందిన ఎవరు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి నాగల రాణిగా ప్రసిద్ధి చెందారు
Answers :-
1. 25 వేల రూపాయలు
2. 18 ఏళ్ల వరకు
3. A,B మాత్రమే సరైనది (రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది)
4. మనమిత్ర
5. 2001
6. ఇమాన్యుయోల్ మాక్రాన్
7. అలెగ్జాండర్ స్టాబ్
8. ఫిన్లాండ్ ఉత్తర ఐరోపాలోని ఒక దేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) సభ్య దేశం. ఇది స్వీడన్, నార్వే మరియు రష్యా మధ్య ఉన్న ఒక నార్డిక్ దేశం.
9. హోం మంత్రిత్వ శాఖ
10. 2027 లో (ఏప్రిల్ 2026 - ఫిబ్రవరి 2027 మధ్య) చేపట్టబోయే జనాభా లెక్కలు భారతదేశంలో మొత్తంగా 16వ మరియు స్వతంత్రానంతరం (1947 తర్వాత) 8వ జనాభా లెక్కలు. ఈ సర్వే ఏప్రిల్ 2026 లో హౌస్ లిస్టింగ్‌తో మొదలై ఫిబ్రవరి 2027 లో జనాభా గణనతో ముగుస్తుంది.
11. భారతదేశంలో లోక్‌సభ స్పీకర్‌పై తొలిసారిగా అవిశ్వాస తీర్మానం (No-confidence motion) 1954లో జీవీ మావలంకర్ (G.V. Mavalankar)పై ప్రవేశపెట్టబడింది. ఆయన భారతదేశపు మొదటి లోక్‌సభ స్పీకర్. నిష్పాక్షికత లోపించిందనే ఆరోపణలతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, అయితే అది నెగ్గలేదు.
12. పదిసార్లు
13. ఇటీవల అస్సాంలో ప్రమాదానికి గురై వార్తల్లో నిలిచిన సుఖోయ్-30 MKI (Sukhoi-30MKI) యుద్ధ విమానాన్ని రష్యాకు చెందిన సుఖోయ్ ఏవియేషన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. భారతదేశంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఈ విమానాలను లైసెన్స్ కింద తయారు చేస్తోంది.
14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక/నియామకం జరుగుతుంది, ఆర్టికల్ 94(c) ప్రకారం స్పీకర్ తొలగింపు జరుగుతుంది. లోక్‌సభ సభ్యులందరిలో మెజారిటీతో (Effective Majority) తీర్మానం ఆమోదిస్తే, 14 రోజుల ముందు నోటీసు ఇచ్చి స్పీకర్‌ను తొలగించవచ్చు.
15. డిప్యూటీ స్పీకర్ కి
17. భారతదేశంలో లోక్‌సభ స్పీకర్ (Speaker) ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయరు. (స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి అప్పటికే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి, రాష్ట్రపతి నియమించిన ప్రొటెం స్పీకర్ (Pro-tem Speaker) మాత్రమే ఉంటారు.)
18. అమెరికా
19. టోర్పిడో
20. నాదస్వర విద్వాంసుడు
21. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో
22. చండీగఢ్ (స్వస్థలం)
23. పంజాబ్ హర్యానా హైకోర్టు
24. ముద్దాడ రవిచంద్ర
25. ఢిల్లీలో
26. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు
27. కర్ణాటకపై (రంజీ ట్రోపీ గెలిచిన 18వ జట్టు జమ్మూ కాశ్మీర్ ఇది 18వ రంజీ ట్రోఫీ కాదు గమనించగలరు)
28. రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలోని అత్యున్నత ఫస్ట్-క్లాస్ దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ (First-Class Cricket Tournament). ఇది అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ తరహాలో 4 రోజుల పాటు (నాకౌట్ దశలు 5 రోజులు), తెల్లటి దుస్తులు మరియు ఎర్రటి బంతితో (Red Ball) ఆడే ఫార్మాట్. ఇందులో ఇరు జట్లు రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి.
29. ఇటీవల రంజీ ట్రోపీ గెలిచిన 18వ జట్టు జమ్మూ కాశ్మీర్ ఇది 18వ రంజీ ట్రోఫీ కాదు గమనించగలరు. ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించినది జమ్మూ కాశ్మీర్ చెందిన బౌలర్ అకిబ్ నాబీ దార్
30. జార్జి ఫెర్నాండెజ్
31. ఇజ్రాయిల్
32. బలేంద్ర షా
33. టెలివిజన్ రేటింగ్ పాయింట్లు
34. ఎలాన్ మాస్క్
35. ముకేశ్ అంబానీ (భారత్ నుంచి మొదటి మూడు స్థానాలు సాధించిన వ్యక్తులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదాని, రోషిని నాడర్ మల్హోత్ర)
36. 308
37. 57వ( 57వ CISF రైజింగ్ డే 2026 మార్చి 6న ఒడిశాలోని ముండలిలో ఉన్న ఖరవేల రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగింది.1969 ఏర్పడింది)
38. సరోజినీ నాయుడు ఈ INC సమావేశం కాన్పూర్ లో జరిగింది
39. భారత తొలి మహిళా సీఎంగా సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ కు 1963 నుంచి 1967 వరకు పనిచేయడం జరిగింది
40. అరుణ ఆసఫ్ అలీ
41. ఉషా మెహతా (కాంగ్రెస్ రేడియో అనే రహస్య రేడియో స్టేషన్ను నిర్వహించింది)
42. కెప్టెన్ లక్ష్మీ సేహగల్
43. 1858 జూన్ 17న గ్వాలియర్ యుద్ధభూమిలోనే వీరమరణం పొందింది
44. కమలాదేవి చటోపాధ్యాయ
45. రాణి గైడిన్ల్యూ