1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 - 27 సంవత్సరానికి ఎన్ని లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది(2025- 26 లో లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది)
2. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులు 2025 గాను ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది (జ్యూరీ చైర్మన్గా మనీ శర్మ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది)
3. గద్దర్ సినీ అవార్డులు 2025 పురస్కారంలో భాగంగా ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారాన్ని ఏ నటుడికి అందజేయడం జరుగుతుంది
4. గద్దర్ అవార్డుల్లో భాగంగా ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం అవార్డును ఏ నటీకి ఎంపిక చేయడం జరిగింది
5. రైసీనా డైలాగ్ సదస్సు ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు
6. ఇటీవల జరిగిన నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏ సంవత్సరం స్థాపించడం జరిగింది
7. ఇటీవల వార్తల్లో నిలుస్తున్న స్పీకర్ ఓం బిర్లా యొక్క నియోజకవర్గం ఏమిటి
8. సాధారణ బిల్లు వివాదాస్పదమైతే పార్లమెంటులో ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు అయితే రాష్ట్రంలో సాధారణ బిల్లు వివాదాస్పంద అయితే ఏ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించడం జరుగుతుంది
9. ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు అయితే భారత్లో ఇప్పటివరకు మూడుసార్లు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది అయితే ఏ సంవత్సరంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించారు
10. ఈ క్రింది వాటిలో సరైనది? A:అవశిష్టఅధికారాలపై కేంద్రానికి అధికారం ఉన్నట్టు ఆర్టికల్ 248 ప్రకారం తెలుస్తుంది. B:1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అవశిష్ట అధికారాలపై అధికారం గవర్నర్ జనరల్ లకు కలదు. C:అంతరిక్ష ప్రయోగాలు అనేవి అవశిష్ట అధికారాల్లో ఒక భాగం
11. ఇటీవల వార్తల్లో నిలుస్తున్న డిమోనా అనే ప్రదేశంలో గల భారీ అను రియాక్టర్ ఏ దేశానికి చెందినది
12. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏ ప్రైవేట్ బ్యాంకు మహిళలకు ఉచిత లాకర్, ఆరోగ్య భీమా కల్పిస్తున్నట్లు ప్రకటించింది(తొలి సంవత్సరం ఉచిత లాకర్ సౌకర్యం, ఏడాది పాటు ఐదు లక్షల కాంప్లిమెంటరీ హెల్త్ కవర్, ఏడాదికి ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటి ఫీచర్లు ఇందులో కలవు)
13. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బ్యాంకింగ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు ఎన్ని మిలియన్ డాలర్ల రుణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది
14. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏ సంస్థ స్ఫూర్తి పేరుతో ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది
15. ప్రస్తుత గూగుల్ సీఈఓ ఎవరు
16. ఫతా- 2 హైపర్ సోనిక్ క్షిపణి ఏ దేశానికి చెందినది
17. ఆంధ్రప్రదేశ్ను గంజాయి మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించడం జరుగుతుంది
18. భారతదేశంలో ఏ నగరంలో మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్కు ఆతిధ్యం ఇస్తుంది
19. 16వ అఖిలభారత పోలీస్ కమాండర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎన్ని పథకాలు
20. తమిళనాడులో గల తమిళగ వెట్రి కలగం పార్టీ అధినేత ఎవరు
21. భారత్ t20 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ ను ఎన్నిసార్లు విజయం సాధించింది మరియు ఏ సంవత్సరాలలో విజయం సాధించింది
22. ఇప్పటివరకు ఎన్ని దేశాలు టీ20 క్రికెట్ పురుషుల ప్రపంచ కప్పును సాధించాయి
23. పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది
24. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ఏమిటి. ఆ బిల్లు ఏ రాజ్యాంగ సవరణ చట్టంగా మారడం జరిగింది
25. పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 విజేతకు నగదు బహుమతి ఇవ్వనున్నారు
26. పురుషుల టి20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది ఎవరు
27. పురుషుల టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది ఎవరు
28. రాజ్యాంగ పరిషత్తు ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు
29. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం లో భాగంగా ప్రతిపాదించిన ఈ క్రింది వాటిలో ఏది సరైనది? A: జనగణమనను జాతీయగీతం గా ఆమోదించడం. B:వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదించడం. C:బాబు రాజేంద్ర ప్రసాద్ ను పూర్తిస్థాయి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం
30. ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు
31. రాజ్యాంగంలో ఆర్టికల్ 243 (H) ఏమిటి తెలుపుతుంది
32. పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రకారం పరిశ్రమలను ఎన్ని వర్గాలుగా విభజించింది
33. 1956 పారిశ్రామిక తీర్మానం ప్రకారం జాబితా ఏలో 17 పరిశ్రమలు ఉంటే జాబితా బిలో ఎన్ని పరిశ్రమలు కలవు
34. 1973 పారిశ్రామిక తీర్మానం ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టడం జరిగింది
35. శాతవాహనుల కాలంలో గుల్మిక అనగా ఏ అధికారి
Answers :-
1. ఐదు లక్షల మంది
2. రాజు వెడ్స్ రాంబాబు
3. చిరంజీవి కి
4. జయసుధకు
5. 2016 నుంచి( రైసినా డైలాగ్ (Raisina Dialogue) 2016 సంవత్సరం నుంచి ప్రతి ఏటా న్యూఢిల్లీలో జరుగుతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) సంయుక్తంగా ఈ భౌగోళిక రాజకీయ సదస్సును నిర్వహిస్తాయి)
6. 2022
7. ఓం బిర్లా ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ మరియు రాజస్థాన్‌లోని కోట-బుండి (Kota-Bundi) లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు. ఆయన 2014, 2019 మరియు 2024 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ఎంపీగా వరుసగా విజయం సాధించారు.
8. భారత రాజ్యాంగంలో పార్లమెంటుకు (ఉభయ సభల సంయుక్త సమావేశం - ఆర్టికల్ 108) ఉన్నట్లుగా రాష్ట్రాల శాసనసభలకు (అసెంబ్లీ, కౌన్సిల్) ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే సదుపాయం లేదు
9. 2002లో 13వ లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి మరణానంతరం, ఆ సమయంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పి.ఎం. సయీద్ (P.M. Sayeed) ఉభయసభల సంయుక్త సమావేశానికి (పోటా బిల్లు కోసం జరిగినది) అధ్యక్షత వహించారు. ఆయన మనోహర్ జోషి స్పీకర్‌గా ఎన్నికయ్యే వరకు ఈ బాధ్యతలను నిర్వహించారు.
10. A,B,C
11. ఇజ్రాయిల్
12. యెస్ బ్యాంక్
13. 500 మిలియన్ డాలర్ల
14. ఎల్ అండ్ టి ఫైనాన్స్
15. సుందర్ పిచాయ్
16. ఇరాన్
17. పోలీస్ శాఖ, ఈగల్
18. హైదరాబాద్
19. నాలుగు పథకాలు
20. విజయ్
21. మూడుసార్లు 2007 2024 2026
22. భారత్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ పాకిస్తాన్ శ్రీలంక ఆస్ట్రేలియా
23. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్
24. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023, చారిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియమ్ (106వ రాజ్యాంగ సవరణ చట్టం, 2023)గా ఆమోదించబడింది, ఇది లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% (మూడింట ఒక వంతు) స్థానాలను రిజర్వ్ చేస్తుంది. ఇది 1996 నుండి వివిధ రూపాల్లో (81వ, 108వ బిల్లులు) ప్రతిపాదనల తర్వాత, సెప్టెంబర్ 2023లో 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబడి, చట్టంగా మారింది.
25. 27.48 కోట్లు
26. సంజు శాంసన్ (ఐదు ఇన్నింగ్స్ లో 321 పరుగులు)
27. జస్ ప్రీత్ బూమ్రా (15 పరుగులు నాలుగు వికెట్లు)
28. సచ్చిదానంద సిన్హా
29. A,B మాత్రమే సరైనవి (బాబు రాజేంద్ర ప్రసాద్ ను తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది)
30. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని
31. ఆదాయ మార్గాలు
32. నాలుగు
33. 12
34. సుభిమాత దత్
35. గ్రామ పాలన నిర్వహణ అధికారి